వైరల్ అవుతున్న మోడీ పాత స్పీచ్
విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్) మార్కెట్లో డాలర్‌తో రూపాయి విలువ భారీగా క్షీణిస్తోంది. ఇవాళ ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయి 77.42ని తాకింది. ఆరంభంలో 77.12 ఉన్నా.. తరవాత బాగా క్షీణించింది. ఈలోగా ఆర్బీఐ మార్కెట్లో ప్రవేశించి డాలర్లను అమ్మి.. రూపాయిని కాపాడింది. దీంతో 77.20 వద్ద ముగిసింది. ఇది కూడా ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి 76.98. గత మార్చి నెలలో నమోదైంది. ఇవాళ ఓపెనింగ్‌లోనే ఆ స్థాయిని దాటింది. దీంతో ఇపుడు విపక్ష పార్టీలు మోడీ గతంలో చేసిన ప్రసంగాల వీడియోలను వైరల్ చేస్తున్నారు. సీఎంగా ఉన్న సమయంలో మోడీ మాట్లాడుతూ పొరుగు దేశాలకన్నా మన కరెన్సీ దారుణంగా ఉందని విమర్శించారు. చిత్రంగా ఇపుడు కూడా మన కరెన్సీ కన్నా బంగ్లాదేశ్ కరెన్సీ పటిష్ఠంగా ఉంది. మోడీ అధికారంలోకి సవ్తే రూపాయి విలువ 40కి చేరుతుందని నాడు ఆధ్యాత్మిక గురు రవిశంకర్, బాబా రామ్ దేవ్ల ట్వీట్లు కూడా ఇపుడు వైరల్ అవుతున్నాయి.
Mitron !! मोदी जी कुछ पूछ रहे है… pic.twitter.com/chba9q1CFk
— Srinivas BV (@srinivasiyc) May 9, 2022