For Money

Business News

రికార్డు స్థాయికి గోధుమ పిండి ధరలు

మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత గోధుమ పిండి ధరలు కూడా భారీగా పెరిగాయి. 2010 తరవాత ఎన్నడూ లేని విధంగా గోధుమ పిండి ధరలు పెరిగాయని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక పేర్కొంది. గోధుల ధరలు పెరగడానికి రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధమని మోడీ అనుకూల మీడియా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తోంది. అయితే గత ఏడాది మే నెలలోనే గోధమ పిండి కిలో ధర రూ. 30.03 ఉందని ఆ పత్రిక పేర్కొంది. గడచిన ఏడాదిలో 9.15 శాతం పెరిగి రూ. 32.78కి చేరినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది. వాస్తవానికి బ్రాండెడ్‌ అంటే కంపెనీలు అమ్ముతున్న గోధమ ధర కిలో రూ.42 నుంచి రూ. 55 దాకా ఉంటోంది.గోధమ ఉత్పత్తి తగ్గడంతో పాటు మన దేశం నుంచి గోధములను భారీగా ఎగుమతి చేయడం కూడా మరో కారణం. గత శనివారం ప్రభుత్వం 156 కేంద్రాల నుంచి గోధమపిండి ధరలను కేంద్రం సేకరించింది. పోర్టు బ్లయర్‌లో కిలో గోధుమ రూ. 59 ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో కిలో రూ.22 ఉంటోంది. కాని కోల్‌కతాలో మాత్రం రూ. 29 ఉందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది. చెన్నైలో కూడా కిలో గోధమ పిండి ధర రూ. 34 ఉండటం విశేషం. అదే ముంబైలో రూ. 49 ఉంటోంది.గ్రామీణ ప్రాంతాల్లో మినహా పట్టణ, నగారల్లో గోధమ పిండి ధరల అధికంగా ఉంటోంది. గోధుమ పంట బాగా పండిన రోజుల్లో కూడా ప్రభుత్వం క్రమంగా కొనగోళ్లను టార్గెట్‌ మేరకే సేకరిస్తోంది. పైగా ఈ ఏడాది సీజన్‌ ఆరంభంలో 37 శాతం తక్కువగా గోధమ సేకరించింది. ఇదే సమయంలో ప్రైవేట్‌ కంపెనీలు ప్రభుత్వం ధర కంటే అధిక ధరకు కొంటున్నారు. మార్కెట్‌లో ధరపై వాటికి నియంత్రణ ఉండటంతో అధిక ధరకు కొంటున్నాయి. పైగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన రైతులకు అధిక ధర అందేలా పరోక్షంగా ప్రభుత్వం తాను ధాన్యం సేకరణను తగ్గిస్తోంది.వంటనూనెల మాదిరిగానే గోధమ పిండిపై కూడా ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం కంపెనీలో ఆటాను ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముతున్నారు. అధిక ధరకు ప్రైవేట్‌ వ్యక్తులు/ కంపెనీలు కొంటుండంతో రైతుల నుంచి కూడా వ్యతిరేకత లేదు. పరోక్షంగా గోధమ సేకరణను ప్రైవేట్‌ పరం అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఫలితంగా వినియోగదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.