24,000 దిశగా నిఫ్టి?
ప్రధాని మోడీ మూడోసారి ప్రధాన మంత్రి అవుతారని ఎగ్జిట్ పోల్స్ తేల్చడంతో సోమవారం స్టాక్ మార్కెట్ ఉరకలెత్తే అవకాశముంది. నిఫ్టి కనీసం 2 శాతంపైగా పెరిగే అవకాశముంది. మంగళవారం ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగా వస్తే నిఫ్టి చాలా త్వరగా 24,000 పాయింట్ల స్థాయిని తాకుతుందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఒత్తిడికి గురవుతున్న ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ ఊరట లభించే అవకాశముంది. ఇప్పటికే పలువురు స్టాక్ మార్కెట్ అనలిస్టులు ‘మోడీ 3.0’ షేర్ల జాబితాను కూడా ప్రకటించేశారు. గత శుక్రవారం అదానీ గ్రూప్ షేర్లు భారీగా పెరిగాయి. సోమవారం ర్యాలీలో కూడా ఈ గ్రూప్ షేర్లకు గట్టి మద్దతు లభించే అవకాశముంది. సమీప భవిష్యత్తులోనే నిఫ్టి 24000 స్థాయిని దాటుతుందని, ఆ తరవాత లాభాల స్వీకరణకు ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.