మహిళా పారిశ్రామిక పార్కు ప్రారంభం
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో మహిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసిన ఫ్లో ఇండస్ట్రియల్ పార్క్ పైలాన్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. 50 ఎకరాల్లో ఈ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఫ్లో) పార్క్‌లో మహిళా పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వీ హబ్ అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన వీ హబ్‌కు సీఈవోగా దీప్తి ఉన్నారని, వీ హబ్ సందర్శించి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు. వీ హబ్ ఇప్పటికే 2,194 స్టార్టప్‌లను రూపకల్పన చేసిందన్నారు. ఇందు కోసం రూ. 66.3 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. స్టార్టప్ నిధులతో 2,800 మందికి ఉపాధి కల్పన సృష్టించామని పేర్కొన్నారు.
On the #InternationalWomensDay will be launching the women industrial park spread over 50 acres established by @FICCIFLO at Sultanpur in Sangareddy district
My compliments to all the women entrepreneurs who’ve kick started their entrepreneurial journey at this park 👍 pic.twitter.com/ZanV981AcG
— KTR (@KTRBRS) March 8, 2022