మెరిసిన మిడ్‌క్యాప్ షేర్లు
అధిక స్థాయిలో ఒత్తిడి వచ్చినా.. నిఫ్టి 18650పైన క్లోజైంది. మిడ్ సెషన్లో ప్రారంభమైన యూరో మార్కెట్లు దాదాపు అరశాతం దాక నష్టాల్లో ఉన్నాయి. దీంతో స్వల్ప ఒత్తిడి వచ్చింది. ఉదయం 18696ని తాకిన నిఫ్టి 18632 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకినా… చివరి క్షణాల్లో కోలుకుని 18660 వద్ద ముగిసింది. ఇవాళ రాత్రి వడ్డీ రేట్లపై ఫెడ్ నిర్ణయం ఉన్నందున.. కొందరు చివరి నిమిషంలో పొజిషన్స్ తీసుకున్నట్లు కన్పిస్తోంది. ఇవాళ నిఫ్టి కన్నా మిడ్ క్యాప్‌లో చాలా యాక్టివిటి ఉంది. సుమారు ఒక శాతంపైగా పెరిగింది నిఫ్టి మిడ్‌క్యాప్. ఇవాళ అధికంగా మెటల్స్, ఐటీ షేర్లలో ఆసక్తి కనిపించింది. అందులోనూ మిడ్ క్యాప్ ఐటీ బాగా లాభపడింది. ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, పర్సిస్టెంట్ షేర్లు చాలా ఆకర్షణీయ లాభాల్లో ముగిశాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్‌కు కూడా ఇవాళ మద్దుత లభించింది. ఇవాళ మిడ్ క్యాప్ బ్యాంక్ షేర్లలో స్వల్ప ఒత్తిడి కన్పించింది. అయితే టాప్ బ్యాంక్స్ బాగా పెరిగాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 4 శాతం పెరగ్గా… ఎస్బీఐ, ఏయూ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ఒక శాతంపైగా లాభంతో ముగిశాయి. పేటీఎం రూ.10 నష్టపోయింది. అలాగే ఎల్ఐసీ షేర్ ఇవాళ కూడా స్వల్పంగా పెరిగి రూ. 724 వద్ద ముగిసింది.