For Money

Business News

మైక్రోసాఫ్ట్‌ చేతికి యాక్టివిజన్‌

వీడియోగేమ్‌ మేకర్‌ యాక్టివిజన్‌ బ్లిజార్డ్‌ను 6870 కోట్ల డాలర్లకు (సుమారు రూ.5 లక్షలకు కోట్లకు పైగా) మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌  కొనుగోలు చేసింది. కంపెనీ చరిత్రలో ఇదే అతి పెద్ద టేకోవర్. యాక్టివిజిన్‌ షేర్‌ను 95 డాలర్లకు కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ అంగీకరించింది. గత శుక్రవారం యాక్టివిజన్‌ షేర్‌ క్లోజింగ్‌ ధరకు ఇది 45 శాతం అధికం. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో గేమింగ్‌ మోస్ట్‌ డైనమిక్‌ విభాగమని.. మెటావెర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ అభివృద్ధిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ళ అన్నారు. ఈ వార్త వెలువడిన వెంటనే యాక్టివిజన్‌ షేర్‌ 38 శాతం పెరిగి 65.39 డాలర్లకు చేరింది.