For Money

Business News

మైక్రోసాఫ్ట్‌ ఢమాల్‌

టెక్‌ షేర్లలో దాదాపు 5.5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌ పడింది ఈ ఏడాది. అయినా ఐటీ పరిశ్రమ కష్టాలు తగ్గలేదు కదా… ఇపుడే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసానికి మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ రాత్రి ఫలితాలు ప్రకటించాయి. ఫలితాలు దారుణంగా ఉండటంతో రెండు షేర్లు రాత్రి భారీగా నష్టపోయాయి. మైక్రోసాఫ్ట్‌ అమ్మకాలు బాగుతున్నా.. నికర లాభం 14 శాతం క్షీణించడంతో పాటు గైడెన్స్‌లో హెచ్చరికలు ఉండటంతో ఇన్వెస్టర్లు ఈ షేర్‌ను భారీగా అమ్మారు. 1.72 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ ఉంది.అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ కంపెనీ షేర్‌ 31 శాతం క్షీణించింది. ఇటీవలి కాలంలో తొలిసారి ఈ కంపెనీ పనితీరు మార్కెట్‌ అంచనాలను తప్పింది. రాత్రి ఈ షేర్‌ 7.7 శాతం నష్టంతో 231.32 డాలర్ల వద్ద ముగిసింది. ఇప్పటికే బాగా క్షీణించినందున.. ఈ షేర్లను కొనుగోలు చేయాల్సిందిగా టెక్నికల్‌ అనలిస్టులు సలహా ఇస్తున్నారు.