For Money

Business News

ఇక మెటల్స్‌పైనే భారం

క్రూడ్‌ దెబ్బకు మార్కెట్‌ ఇవాళ కూడా నష్టాలతో ప్రారంభం కానుంది. ఈ వీక్లీ సిరీస్‌లో మే నెల కనిష్ఠం 23300 దాకా పడుతుందేమో చూడాలి. దిగువస్థాయి నుంచి కోలుకుంటే ఈ సిరీస్‌లో 24000 కోసం ప్రయత్నిస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి అమెరికా మార్కెట్ల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై ఉంది. నవంబర్‌ 3 మధ్యంతర ఎన్నికలు పూర్తయిన తరవతాఏ ఇరాన్‌ యుద్ధం ముగుస్తుందని ట్రంప్‌ చెప్పడంతో పాటు ఇరాన్‌పై దాడులు ముమ్మరం చేయడంతో బ్రెంట్‌ క్రూడ్‌ 102 డాలర్ల వైపు పరుగులు పెడుతోంది. బాండ్ ఈల్డ్స్‌ తగ్గించేందుకు ఫెడరల్‌ రిజర్వ్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాత్రి బాండ్‌ ఈల్డ్స్‌ బాగా పెరిగాయి. బాండ్‌ ఈల్డ్స్‌, క్రూడ్ కారణంగా రాత్రి అమెరికా, ఉదయం ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. మన మార్కెట్లదీ అదే పరిస్థితి. మార్కెట్‌లో మెటల్‌ షేర్లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా డాలర్‌ కాస్త తగ్గడమే దీనికి కారణం. అలాగే ఐటీ షేర్లలో ఇవాళ కూడా ఒత్తిడి వస్తుందేమో చూడాలి. ఎందుకంటే నిన్న మూడు శాతంగా పైగా ఐటీ ఇండెక్స్‌ పడింది. ఇవాళ ఐటీ పడితే… దానితో పాటు రియాల్టి షేర్లు కూడా బాగా పడుతాయి. ఇక సీఎన్‌బీసీ ఇవాళ చార్ట్స్‌ ఆధారంగా Nifty Energy, CG Power, Coal India, BHELను గ్రీన్‌లో ఉంచాయి. అంటే పెరిగే ఛాన్స్‌ ఉందని తెలిపింది. ఇక బిగ్‌ స్టాక్స్‌ కింద ఏథర్‌ రెనర్జి, రెడింగ్టన్‌, హిందుస్థాన్‌ కాపర్‌, హిందుస్థాన్‌ జింక్‌, ఆయిల్‌ ఇండియా, నాల్కో, హిందాల్కో షేర్లను సిఫారసు చేసింది. ఏథర్‌, రెడింగ్టన్‌ తప్ప దాదాపు అన్నీ మెటల్‌ షేర్లు. క్రూడ్‌ కారణంగా ఆయిల్‌ ఇండియా ఎంపిక చేశారు. ఇవాళ అత్యంత కీలక పాయింట్‌… సెన్సెక్స్‌ వీక్లీ డెరివేటివ్స్‌ నేడు. వస్తే ఇవాళ దిగువస్థాయిలో మద్దతు రావాల్సి ఉంది.

Leave a Reply