మీడియా షేర్లకు ‘జీ’ జోష్
నిజం చెప్పాలంటే.. జీ కంపెనీ కొనే అంశాన్ని సోని పరిశీలించేందుకు డీల్ చేసుకుంది. 90 రోజుల్లో కంపెనీని మదింపు చేసి… జీని కొనుగోలు చేస్తానని సోని పేర్కొంది. ఇది బైండింగ్ డీల్ కాదు. మరి ఇది సాధ్యమైతుందా? డీల్ సక్సెస్ అవుతుందా? ఎవరికి తెలుసు? కాని స్టాక్ మార్కెట్లో మాత్రం జీ ఎంటర్టైన్మెంట్తో పాటు మొత్తం మీడియా షేర్లకు డిమాండ్ పెరిగింది. జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ కూడా 10 శాతం అప్పర్ సీలింగ్‌లో ట్రేడవుతోంది. ఎంకే స్టాలిన్ సీఎంగా ఎన్నికైనా.. సన్ టీవీలో షేర్లో పెద్దగా మార్పు లేదు. కాని జీ డీల్ తరవాత ఈ కంపెనీ షేర్ వ్యాల్యూయేషన్ మారుతోంది.ఇవాళ ఈ షేర్ కూడా 5 శాతం పెరిగింది. జీటీవీతో పాటు సన్ టీవీ, నెట్వర్క్ 18, డిష్ టీవీ, టీవీ బ్రాండ్‌కాస్ట్, టీవీ టుడే షేర్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. వీటిలో చాలా షేర్లు అప్పర్ సీలింగ్‌లో ట్రేడవుతున్నాయి. అదానీ గ్రూప్ టేకోవర్ చేస్తుందన్న వార్తలతో నిన్న ఎన్డీటీవీ పది శాతం లాభంతో ముగిసింది. ఇది అప్పర్ సీలింగ్. తాము వాటా అమ్మడం లేదని ఎన్డీటీవీ స్పష్టం చేసినా.. ఇవాళ కూడా ఎన్డీటీవీ 10 శాతం అప్పర్ సీలింగ్‌తో ట్రేడవుతోంది. జీ డీల్‌తో ఈ కౌంటర్‌పై ఆసక్తి పెరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పట్లో చర్చలు జరగడం లేదని చెప్పడం ద్వారా… మున్ముందు డీల్ ఉంటుందని ఎన్డీటీవీ పరోక్షంగా చెప్పిందా అన్న అనుమానాలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఎన్ఎస్ఈలోఈ కౌంటర్ అమ్మకందారులు లేరు.