For Money

Business News

మార్కెట్‌లోకి కొత్త ఆల్టో కే10

థర్డ్ జనరేషన్‌ ఆల్టో కే10 కారును మారుతీ సుజుకీ ఇవాళ మార్కెట్‌లో ప్రవేశ పెట్టింది. ఈ మోడల్‌ ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌) కాగా, టాప్‌ ఎండ్‌ మోడల్‌ ధర రూ. 5.83 లక్షలని కంపెనీ పేర్కొంది. రూ. 11000 చెల్లించి ఇవాళ్టి నుంచే ఈ కారును బుక్‌ చేసుకోవచ్చు. మారుతీ సుజుకి ఏరియా డీలర్‌ వద్ద లేదా https://www.marutisuzuki.com/altoలో లాగిన్‌ అయి కారు బుక్‌ చేసుకోవచ్చు. మొత్తం ఆరు మోడల్స్‌ (STD, LXI, VXI, VXI+, VXI AGS, VXI+ AGS) లభిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ కారు 24.9 కి.మీ. మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.