15800 దిగువన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 15800 స్థాయిని కోల్పోయి 15753 పాయింట్లను తాకింది. ప్రస్తుతం 15779 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 52 పాయింట్లు క్షీణించింది. అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అన్నీ దాదాపు అర శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. క్రూడ్ ధరలు పెరగడంతో ఓఎన్జీసీ టాప్ గెయినర్‌గా నిలిచింది. టైటాన్ టాప్ లూజర్‌గా నిలిచింది. ప్రధాన బ్యాంకుల షేర్లు చాలా వరకు అర శాతంపైగా నష్టపోయాయయి. జొమాటొ ఇవాళ అయిదు శాతంపైగా నష్టపోయింది. పే టీఎం ఇవాళ కూడా రెండు శాతం దాకా పెరిగింది.