18000 దిశగా మార్కెట్
ఈక్విటీ మార్కెట్లో నెగిటివ్స్ దాదాపు అయిపోయాయని.. మార్కెట్ ఇక్కడి నుంచి పెరిగేందుకు ఛాన్స్ ఉందని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. బ్రెంట్ క్రూడ్ 90 డాలర్ల దిగువకు రావడం మార్కెట్‌కు చాలా అనుకూల అంశమని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇక మార్కెట్ విషయానికివస్తే.. నిన్న కూడా మార్కెట్ 17500 దిగువకు వెళ్ళి … కోలుకుందని ఆయన అన్నారు. నిన్న 17484ని తాకిన విషయం తెలిసిందే. అయితే ఇన్వెస్టర్లు ఇంట్రాడే కనిష్ఠ స్థాయి కాకుండా… క్లోజింగ్‌లో నిఫ్టి 17500 దిగువ క్లోజైతేనే… మార్కెట్ షార్టింగ్ ఆప్షన్స్ గురించి ఆలోచించాలని.. లేకుంటే 17500 స్టాప్‌లాస్‌తో తమ లాంగ్ పొజిషన్స్‌ను కొనసాగించవచ్చని అంటున్నారు. నిఫ్టి 18000 లేదా 18100 వైపు పరుగులు తీయడం ఖాయమని ఆయన అన్నారు. కొద్ది రోజుల్లో లేదా నెలాఖరుకల్లా నిఫ్టి ఈ స్థాయికి చేరుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పొజిషనల్ ట్రేడర్స్ 17500స్థాయిని గమనించాలని… మార్కెట్ ఈ స్థాయికి దిగువన ముగిసినపుడే వ్యూహం మార్చాలని ఆయన అంటున్నారు. మార్కెట్‌కు అన్ని మంచి శకునాలే ఉన్నాయని అశ్నని గుజ్రాల్ తెలిపారు.