స్థిరంగా ముగిసిన స్టాక్ మార్కెట్
2021 చివరి డెరివిటేవ్స్ కాంట్రాక్ట్ దాదాపు స్థిరంగా ముగిశాయి. కొన్ని రోజుల ముందే అసలైన ట్రేడింగ్ పూర్తయినట్లు ఇవాళ్టి సూచీ కదలికలు చెబుతున్నాయి. సింపుల్‌గా ఎక్కడ ప్రారంభమైందో… అక్కడే ముగిసింది. ఒకదశలో 17,264ను తాకి తరవాత 17146ని తాకినా.. క్లోజింగ్ వచ్చే సరికి క్రితం ముగింపుస్థాయి వద్దే ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 10 పాయింట్ల నష్టంతో 17,203 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టి ఎట్టకేలకు గ్రీన్‌లో ముగిసింది.27 షేర్లు నష్టాల్లో ముగిస్తే… 23 షేర్లు లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లనే సెలవు మూడ్‌లో ఉన్నందున మన మార్కెట్‌పై పెద్ద ప్రభావం లేదు. ఎంపిక చేసిన షేర్లలో మాత్రం భారీ హెచ్చతగ్గులున్నాయి. మళ్ళీ చిప్‌ల కొరత వస్తుందన్న వార్తలతో ఆటో షేర్లు నష్టాల్లో ముగిశాయి.