For Money

Business News

రూ. 300 పెరిగిన బంగారం ధర

ఒక్కరోజులోనే బంగారం ధర రూ.300 పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. న్యూఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.47,071 నుంచి రూ.47,382కు పెరిగింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.300 పైగా పెరిగి రూ.43,402కి చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.44,300గా ఉంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,330గా ఉంది. వెండి ధర కూడా సుమారు రూ.200 పెరిగి కిలో రూ.63,013కు చేరింది. మన మార్కెట్లు ముగిసిన తరవాత అంతర్జాతీయ మార్కెట్లలో బులియన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్‌ బంగారం 1795 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.