For Money

Business News

రూ. 750 కోట్లతో మలబార్‌ గోల్డ్‌ ప్లాంట్‌

తెలంతాణ రాష్ట్రంలో రూ. 750 కోట్ల పెట్టుబడితో డైమండ్ జ్యువలరీ తయారీ ఫ్యాక్టరీతో పాటు రిఫైనరీ కూడా పెట్టేందుకు మలబార్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ ప్లాంట్‌ వల్ల 2,500 మందికి పైగా నైపుణ్యం కలిగిన స్వర్ణ కారులకు ఉపాధి అవకాశం లభిస్తుంది. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ బృందంతో ఇవాళ భేటీ అయింది. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అనుకూల వాతావరణం, ఇక్కడి ప్రభుత్వం పాలసీలను పరిగణలోకి తీసుకొని ఈ పెట్టుబడి నిర్ణయం తీసుకున్నామని మలబార్ గ్రూప్ పేర్కొంది. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్‌కు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.