For Money

Business News

17,500పైన ముగిసిన నిఫ్టి

ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ఉండగా మన మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. టెలికాం రంగానికి ప్యాకేజీ ఇవ్వడంతో భారతీ ఎయిర్‌టెల్‌ 5 శాతం దాకా లాభపడింది. క్రూడ్‌ ధరలు పెరగడంతో ఓఎన్‌జీసీతో పాటు కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ షేర్లు కూడా ఇవాళ భారీగా పెరిగాయి. బొగ్గు ధరలను పెంచుతామని ప్రకటించడంతో నిన్నటి నుంచి కోల్‌ ఇండియా షేర్‌ పెరుగుతోంది. ఉదయం ఆసియా, మధ్యాహ్నం ప్రారంభమైన యూరో మార్కెట్లు వీక్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. పెరుగుతున్న బొగ్గు ధరలు, క్రూడ్‌ ధరలు మన మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. కేవలం లిక్విడిటీ కారణంగా షేర్లను ఇన్వెస్టర్లు కొంటూనే ఉన్నారు. మరోవైపు కన్జూమర్‌ గూడ్స్‌ షేర్లు పడుతూనే ఉన్నాయి. ఉదయం 17,386ని తాకిన నిఫ్టి తరవాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఒకదశలో 17,532ని తాకి 139 పాయింట్ల లాభంతో 17,519 పాయింట్ల వద్ద ముగిసింది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఎన్‌టీపీసీ 124.55 7.46
భారతీ ఎయిర్‌టెల్‌ 727.50 4.80
కోల్‌ ఇండియా 160.85 3.98
ఓఎన్‌జీసీ 128.75 3.87
టైటాన్‌ 2,118.00 3.03

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా కన్జూమర్‌ 872.90 -0.95
నెస్లే ఇండియా 20,120.00 -0.55
గ్రాసిం 1,603.90 -0.49
బీపీసీఎల్‌ 491.25 -0.38
ఏషియన్‌ పెయింట్స్‌ 3,350.00 -0.37