ఎలక్ట్రిక్ వెర్షన్‌గా ఎక్స్‌యూవీ 300
మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన XUV 300 SUV ఎలక్ట్రిక్ వెర్షన్‌ను వచ్చే మార్చిలోగా విడుదల చేయాలని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం ‘బర్న్ ఎలక్ట్రిక్ విజన్’ అనే పేరుతో వచ్చే ఆగస్టులో ఈవీల వ్యాపారం ప్రారంభించబోతోంది. ఫోక్స్‌వ్యాగన్‌తో కలిసి ఈవీ బిజినెస్‌ను కంపెనీ చేపట్టిన విషయం తెలిసిందే. ఎక్స్‌యూవీ 300 ఎలక్ట్రిక్ వెర్షన్‌ను వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో విడుదల చేయాలనుకుంటున్నట్లు మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ తెలిపారు. దీని ధర రూ. 13 లక్షల కన్నా అధికంగా ఉంటుది. ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌యూవీ 700కి డిమాండ్ బాగుందని, వెయిటింగ్ పీరియడ్ 18-24 నెలలు ఉండటంతో కస్టమర్లు బుకింగ్‌లను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ వాహనం పొడుపు 4.2 మీటర్ల పొడువు ఉన్నందున సబ్ 4 మీటర్ కేటగిరికి ఉన్న కొన్ని ప్రయోజనాలు ఇందులో ఉండవని పేర్కొన్నానరు. ప్రస్తుతం ఈవీ మార్కెట్‌లో టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ నంబర్ వన్ బ్రాండ్‌గా కొనసాగుతోంది.