For Money

Business News

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టయ్యారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) కేసులో సీబీఐ అధికారులు ఆమెను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పేరుతో రూ.50 కోట్ల మేర రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలతో పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గీతను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షల తరవాత ఆమె సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. గీతతో పాటు ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. వీరితో పాటు బ్యాంకు అధికారులు బీకే జయప్రకాశన్‌, కేకే అరవిందాక్షన్‌కూ ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.2లక్షల జరిమానా విధించింది. మరోవైపు తెలంగాణ హైకోర్టులో ఆమె తరఫు న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.