For Money

Business News

బీమా పాలసీ ప్రీమియంలో 25 శాతం జంప్‌?

ఇపుడు ఇన్సూరెన్స్‌ కంపెనీల వంతు. టర్మ్‌ పాలసీ ప్రీమియంలను కనీసం 15 శాతం నుంచి 25 శాతం దాకా పెంచాలని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ భావిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ రంగంలో ప్రైవేట్‌ కంపెనీల వాటా పెరుగుతోంది. మరోవైపు రీఇన్సూరెట్లు భారీగా పెరిగినందున టర్మ్‌ పాలసీ ప్రీమియం పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఒక వ్యక్తి రూ.1000లు బీమా చేయిస్తే.. ఆ మొత్తం రిస్క్‌ తాము భరించకుండా అందులో కొంత మొత్తాన్ని మరో కంపెనీ వద్ద ఇన్సూరెన్స్‌ చేస్తాయి ఇన్సూరెన్స్‌ కంపెనీలు. దీంతో రిస్క్‌ భారం తగ్గుతుంది. మరి రీఇన్సూరెన్స్‌ రేట్లు 40 శాతం నుంచి 60 శాతం దాకా పెరగడంతో బీమా కంపెనీలు టర్మ్‌ పాలసీల ప్రీమియంను పెంచక తప్పడం లేదు.