కొనసాగుతున్న ఎల్ఐసీ జోరు
డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఎల్ఐసీ రూ.8,334.2 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.235 కోట్లు మాత్రమే. అయితే రెండో త్రైమాసికంలో నమోదైన రూ.15 వేల కోట్లతో పోలిస్తే సగానికి సగం తగ్గింది. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ నికర ప్రీమియం ఆదాయం రూ.1,11,787.6 కోట్లు కాగా… గత ఏడాది ఇదే కాలంలో ప్రీమియం రూ.97,620.34 కోట్లు. పెట్టుబడులపై వచ్చిన ఆదాయం రూ.76,574 కోట్ల నుంచి రూ.84,889 కోట్లకు పెరిగినట్లు ఎల్ఐసీ ప్రకటించింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ 60 శాతం క్షీణించినా… ఆ గ్రూప్‌లో పెట్టిన రూ. 36000 కోట్ల పెట్టుబడిపై లాభాల్లోనే ఉన్నట్లు ఎల్ఐసీ పేర్కొంది. వాటాదార్ల నిధికి రూ. 2000 కోట్లను బదలాయిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.