For Money

Business News

నష్టాల నుంచి కోలుకున్న నిఫ్టి

ఉదయం భారీ నష్టాల్లో జారుకున్న నిఫ్టి… దిగువ స్థాయి నుంచి 200 పాయింట్లకు పైగా కోలుకుంది. ఆరంభంలో 17,779ని తాకిన సూచీ… మిడ్‌ సెషన్‌కల్లా కోలుకుంది. గ్రీన్‌లోకి వచ్చినా… మళ్ళీ ఒత్తిడికి లోనైంది. యూరప్‌ మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడ్‌ కావడం, వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్ కారణంగా చివర్లో షార్ట్‌ కవరింగ్‌ వచ్చింది. దీంతో నిఫ్టి మళ్ళీ లాభాల్లోకి వచ్చి 17,893 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో ముగిసింది. అయితే నిఫ్టి నెక్ట్స్‌ మాత్రం అర శాతం నష్టంతో ముగిసింది. అదానీ షేర్లలో వచ్చిన భారీ ఒత్తిడే దీని కారణం. నిఫ్టి విషయానికొస్తే ఒకదశలో 20 శాతం క్షీణించిన అదానీ ఎంటర్‌ప్రైజస్‌ తరవాత కోలుకున్నా 11 శాతం నష్టంతో రూ. 1922 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్‌ కూడా మూడు శాతం తగ్గింది. ఇక నిఫ్టి నెక్ట్స్‌లో అంబుజా సిమెంట్‌, అదానీ టోటల్‌, అదానీ గ్రీన్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, ఏసీసీ షేర్లు అయిదు నుంచి 7 శాతం నష్టంతో ముగిశాయి. అదానీ గ్రూప్‌లోని అన్ని షేర్లు నష్టాల్లో క్లోజ్‌ కాగా, అదానీ విల్మర్‌ ఒక్కటే 5 శాతం లాభంతో ముగిసింది. మరోవైపు మిడ్‌ క్యాప్‌ సూచీ 0.3 శాతం లాభంతో క్లోజ్‌ కాగా, నిఫ్టి బ్యాంక్‌లో పెద్ద మార్పు లేదు.