For Money

Business News

అదానీ షేరర్లకు MSCI దెబ్బ

వరుసగా రెండు రోజులు లాభాల్లో కొనసాగిన అదానీ షేర్లకు ఇవాళ మరో దెబ్బ తగ్గింది. అదానీ షేర్లను తాము సమీక్షిస్తామని ఇండెక్స్‌ ప్రొవైడర్‌ అయిన MSCI ప్రకటించడంతో అదానీ షేర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ ఇండెక్స్‌లో కేవలం అదానీ విల్మర్‌ షేర్‌ మాత్రమే లేదు. ఈ సూచీలో ఉన్న మిగిలిన 9 షేర్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. MSCI నిర్ణయంతో తమ నివేదికలో చేసిన ఆరోపణలు నిజమేనని తేలిందని హెండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ పేర్కొంది. అదానీ విల్మర్‌ షేర్‌ అయిదు శాతం లాభంతో క్లోజ్‌ కాగా, మిగిలిన సేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ అదానీ ఎంటర్‌ప్రైజస్‌ షేర్‌ 20 శాతం క్షీణించి రూ.1731ని తాకింది. అక్కడి నుంచి కోలుకుని 10.44 శాతం నష్టంతో రూ. 1,938 వద్ద ట్రేడవుతోంది.ఈ షేర్‌తో పాటు అదానీ పోర్ట్స్‌, అదానీ పోర్ట్స్‌, ఏసీసీ, అంబుజా సిమెంట్‌, అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ గ్రీన్‌ షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి.