గూగుల్‌కు బార్డ్ దెబ్బ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో చాట్‌జీపీటీకి (chatGPT) పోటీగా గూగుల్ ‘బార్డ్’ (Bard)ను తేవడం ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు నచ్చినట్లు లేదు. కంపెనీ ప్రమోషనల్ వీడియోలో చేసిన చిన్న తప్పు కారణంగా ఆ కంపెనీ షేర్లు దారుణంగా దెబ్బతిన్నాయి. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ నిన్న రాత్రి ఏకంగా 10,000 కోట్ల డాలర్లు క్షీణించింది. రాత్రి కంపెనీ షేర్ 7.68 శాతం క్షీణించి 99.37 వద్ద ముగిసింది. ఇవాళ ప్రి మార్కెట్‌లో కేవలం ఒక శాతం పెరిగి 100 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బార్డ్‌ను పరిచయం చేస్తూ గూగుల్ రూపొందిచిన ఓ ప్రమోషనల్ వీడియోతో కంపెనీ ఇన్వెస్టర్లు కంగుతిన్నారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి అడిగిన ఓ ప్రశ్నకు బార్డ్ కొన్ని సమాధానాల్లో ఒక సమాధానం తప్పని తేలిందన్న వార్త నిన్న వైరల్ అయింది. దీంతో బార్డ్ సామర్థ్యంపై అపుడే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో అల్ఫాబెట్ షేర్లు విలువ రాత్రి దాదాపు 10,000 కోట్ల డాలర్లు తగ్గింది.