For Money

Business News

నష్టాల నుంచి తేరుకున్న నిఫ్టి

ఉదయం ఆరంభంలోనే నష్టాల్లో జారకున్న నిఫ్టి తరవాత 17,779ని తాకింది. పలు షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చినా… తరవాతి గంటలో నిఫ్టి కోలుకుని లాభాల్లోకి వచ్చింది. ఇపుడు 17887 పాయింట్లను తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 18 పాయిట్ల లాభంతో నిఫ్టి ట్రేడవుతోంది. ఫలితాల తరవాత నష్టాల్లో జారకున్న దివీస్‌ ల్యాబ్‌ ఇవాళ నిఫ్టిలో టాప్‌ గెయినర్‌గా మారింది. ఈ షేర్‌ దాదాపు రెండు శాతం పెరిగి రూ. 2850ని తాకింది. బజాజ్‌ ఫైనాన్స కూడా కోలుకుని ఒకటిన్నర శాతం లాభపడింది. నిన్న భారీగా లాభాలు పొందిన అదానీ గ్రూప్‌ షేర్లలో మళ్ళీ ఒత్తిడి మొదలైంది. అదానీ టోటల్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పునః పరిశీలిస్తున్నట్లు టోటల్‌ కంపెనీ ప్రకటించడంతో… మొత్తం గ్రూప్‌ షేర్లపై ఒత్తిడి పెరిగింది. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో అదానీ ఎంటర్‌ ప్రైజస్‌, అదానీ పోర్ట్స్‌ ముందున్నాయి. ఇక అదానీ టోటల్‌, అదానీ ట్రాన్స్‌ మిషన్‌, అంబుజా సిమెంట్స్‌, అదానీ గ్రీన్‌, ఏసీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.