For Money

Business News

వెలుగులో ఎల్‌ఐసీ

చాలా రోజుల తరవాత ఎల్‌ఐసీ షేర్‌లో కాస్త యాక్టివిటీ కన్పిస్తోంది. కంపెనీ ఫలితాలు ప్రకటన తరవాత ఈ షేర్‌ ఇవాళ రూ. 22పైగా పెరిగింది. ఈ షేర్‌ క్రితం ముగింపు రూ. 682 కాగా, ఇవాళ రూ. 704.55ను తాకింది. ఈ షేర్‌ను రూ. 850 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ఎల్‌ఐసీలో డౌన్‌ట్రెండ్ ముగిసినట్లేనని.. నిఫ్టి పెరిగితే ఈ షేర్‌లో కూడా అప్‌ ట్రెండ్‌ కొనసాగుతుందని అనలిస్టులు అంటున్నారు.