For Money

Business News

పడితే కొనండి…

నిఫ్టి ఏమాత్రం కరెక్షన్‌ వచ్చినా కొనుగోలు చేయాలని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని అన్నారు. సీఎన్‌బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ…నిఫ్టిలో అప్‌ ట్రెండ్‌ కొనసాగే అవకాశముందని అన్నారు. మరో అనలిస్ట్‌ మితేస్‌ టక్కర్ కూడా పడితే కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారు. నిఫ్టి 18000 లేదా 18200 ప్రాంతానికి చేరొచ్చని తెలిపారు.
సుదర్శన్‌ సుఖాని ఐషర్‌ మోటార్‌రూ. 3131 స్టాప్‌లాస్‌తో కొనాలని సలహా ఇచ్చారు. ఇండియన్‌ హోటల్స్‌ రూ. 265 స్టాప్‌లాస్‌తో, ఆర్‌ఈసీని రూ. 133 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు.ఇప్కా ల్యాబ్‌ను రూ. 940 స్టాప్‌లాస్‌తో అమ్మాలని ఆయన సలహా ఇచ్చారు.
ఇక మితేష్‌ టక్కర్‌ ఎన్‌టీసీపీని రూ. 163 టార్గెట్ రూ. 581 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు. సింజీన్‌ టార్గెట్ రూ. 612 కాగా, స్టాప్‌లాస్‌ రూ.581. ఇక అరబిందో ఫార్ఆ షేర్‌ను రూ.615 టార్గెట్‌ రూ.582 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌ను రూ.900 టార్గెట్‌తో రూ.860స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు.