హౌసింగ్ లోన్: వడ్డీ రేటు తగ్గింపు
పండుగ సీజన్లో బ్యాంకులు పోటీపోటీగా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఈ రేసులో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) కూడా చేరింది. పండుగ సీజన్ ఆఫర్లలో భాగంగా హౌసింగ్ లోన్లను అతి తక్కువగా 6.66శాతం వడ్డీకే అందించనున్నట్లు ప్రకటించింది. రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలకు ఈ వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త ఆఫర్ సిబిల్ స్కోరు 700 అంతకంటే ఎక్కువ ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 22 నుంచి నవంబర్ 30, 2021 వరకు మంజూరు చేసిన రుణాల మాత్రమే వర్తిస్తుంది అని తెలిపింది. గతంలో ఈ ఆఫర్ రూ.50 లక్షల వరకు ఉన్న హౌసింగ్ లోన్లకే ఉండేది… ఇపుడు రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలకు కూడా వర్తింపజేస్తున్నారు.