15 శాతం డౌన్
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ పనితీరు నిరాశాజనకంగా ఉండటతో ఆ షేర్ ఇవాళ ఓపెనింగ్‌లోనే తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఈ షేర్ ఓపెనింగ్‌లోనే రూ. 400.50 నుంచి రూ. 348.65కు క్షీణించింది. దాదాపు 15 శాతం క్షీణించిన తరవాత ఇపుడు 11 శాతం నష్టంతో రూ. 355.25 వద్ద ట్రేడవుతోంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంస్థ పనితీరు రోజురోజుకూ క్షీణిస్తోంది. మున్ముందు కూడా వడ్డీ రేట్లు పెరగడమే గాక.. ఇతర ప్రభుత్వ బ్యాంకులు కూడా హౌసింగ్ రంగంలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ పోటీని తట్టుకోవడంలో ఎల్ఐసీ హౌసింగ్ ఇబ్బందులు పడుతోంది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ. 304.97 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది . క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన రూ .247.86 కోట్లతో పోలిస్తే ఇది 23 శాతం మాత్రమే పెరిగింది. మార్కెట్ అంచనాలకు దూరంగా ఉంది. ఆదాయం రూ .4,708 కోట్ల నుంచి రూ .5.086 కోట్లకు పెరిగినా.. వడ్డీ ఆదాయం రూ .1,173 కోట్ల నుంచి రూ .1163 కోట్లకు పడిపోయింది.