ఐపీఓ ముందు ఎల్‌ఐసీ భళా!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి ఆరు నెలల్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–సెప్టెంబర్‌లో నికర లాభం భారీగా పెరిగి రూ. 1,437 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది (2020–21) ఏప్రిల్–సెప్టెంబర్‌లో నికర లాభం రూ. 6.14 కోట్లు మాత్రమే. కొత్త బిజినెస్ ప్రీమియం 554 శాతం వృద్ధి చూపినట్లు ఎల్‌ఐసీ వెల్లడించింది. మొత్తం నికర ప్రీమియంలు రూ. 1,679 కోట్లు పెరిగి దాదాపు రూ. 1.86 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే కాలంలో నికర ప్రీమియం వసూళ్ళు రూ. 1.84 లక్షల కోట్లు. మొత్తం ప్రీమియంలు, పెట్టుబడులపై ఆదాయం రూ.17,404 కోట్లు పెరిగి రూ. 3.35 లక్షల కోట్లకు చేరింది. వీటిలో పెట్టుబడులపై ఆదాయం ద్వారా మొత్తం రూ. 15,726 కోట్లు పెరిగి రూ. 1.49 లక్షల కోట్లకు చేరింది.