For Money

Business News

సుప్రీం కోర్టుపై నమ్మకం పోయింది

తాను పదే పదే సుప్రీంకోర్టుకు వెళ్ళి విసిగిపోయానని, అక్కడికి వెళితే ఏదైనా ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించడం లేదని సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తనకు సుప్రీం కోర్టుపై నమ్మకం పోయిందని అన్నారు. “మేము కోర్టుకు వెళ్తాము, కానీ మాకు ఏదైనా ఉపశమనం లభిస్తుందో లేదో తెలియదు. ఈ ప్రభుత్వం పోవాలని దేశ ప్రజలు భావిస్తున్నారు. ఈ సమయంలో రాజ్యాంగాన్ని ఎవరైనా కాపాడగలరంటే, అది భారత సుప్రీంకోర్టే. కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళి… వెళ్ళి నేను విసిగిపోయాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సుప్రీం కోర్టుకు వెళ్ళడంతో ఎలాంటి ప్రయోజనం ఉందని నేను అనుకోవడం లేదు. భారత సుప్రీంకోర్టుపై నాకు పెద్దగా నమ్మకం లేదు. ఏది జరగాల్సి ఉందో, అదే జరుగుతుంద”ని కపిల్‌ సిబల్‌ అన్నారు. ఓటర్ల పేర్లను తప్పుగా తొలగిస్తున్నారని, తప్పుగా నమోదు చేస్తున్నారని తాము సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చామని ఆయన అన్నారు. నెలల తరబడి వాదించామని, దానికి ప్రజలే సాక్ష్యమని అన్నారు. అప్పీలేట్ ట్రిబ్యునల్స్ కూడా 93% మంది ఓటర్లను తప్పుగా తొలగించారని ఇపుడు చెబుతున్నాయి. ఈ విషయం సుప్రీంకోర్టుకు కూడా తెలిసే ఉంటుంది. కానీ ఎటువంటి ఉపశమనం లేదు. ఇదంతా తన వ్యక్తి అభిప్రాయమని కపిల్‌ సిబల్‌ అన్నారు.

Leave a Reply