25 కిలోల బియ్యం ప్యాక్‌పై 5 శాతం జీఎస్టీ
ఆహార వస్తువుల ప్రి ప్యాకెజ్డ్, బ్రాండెడ్ వస్తువలపై అయిదు శాతం జీఎస్టీకి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సస్ అండ్ కస్టమ్స్ (CBIC) వివరణ ఇచ్చింది. బియ్యం, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, గోధుమ, నూనెలు వంటి ఆహార పదార్థాలు 25 కిలోలు లేదా 25 లీటర్లు అంతకన్నా తక్కువ బరువుతో ప్యాక్ చేసి అమ్మితే 5 శాతం జీఎస్టీ కట్టాలని స్పష్టం చేసింది. అంతకుమించి బరువు ఉంటే మాత్రం జీఎస్టీ కట్టాల్సిన పనిలేదు. అలాగే 25 కిలోలు లేదా 25 లీటర్ల కన్నా తక్కువ ఉన్న ప్యాకెట్లు కలిసి ఓ పెద్ద సంచిగా అమ్మిన జీఎస్టీ కట్టాల్సిందేనని పేర్కొంది. ఉదాహరణకు 5 కిలోల ప్యాకెట్లు 20 ఉన్న సంచిపై కూడా ఒక్కో ప్యాకెట్‌పై 5 శాతం జీఎస్టీ ఉంటుందని… మొత్తం సంచి 25 కిలోల కన్నా అధిక బరువు ఉందని తప్పించుకోలేరని పేర్కొంది.అంతిమంగా సదరు ప్యాకెట్ వినియోగదారుడు ఏ బరువుతో అంటే కిలోల లేదా లీటర్లను బట్టి జీఎస్టీ ఉంటుందని పేర్కొంది. 25 కిలోలు లేదా లీటర్ల లోపు ఉన్నవాటిపై సైజు ఎంత ఉన్నా కచ్చితంగా 5 శాతం జీఎస్టీ కట్టాల్సిందేనని తెలిపింది.