కేటీఆర్‌తో కైటెక్స్ గ్రూప్ అధినేత భేటీ
కేరళకు చెందిన ప్రముఖ టెక్సటైల్ కంపెనీ కైటెక్స్ ఛైర్మన్ సాబు జాకబ్ ఇవాళ హైదరాబాద్ వచ్చారు. రూ. 3,500 కోట్లతో కంపెనీ విస్తరణ చేపట్టింది. కేరళలో స్థానిక ప్రభుత్వంతో గొడవ పడిన ఈ గ్రూప్ ఇతర రాష్ట్రాల్లో విస్తరణ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల ప్రోత్సాహకాలను పరిశీలిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇవాళ హైదరాబాద్ వచ్చిన కైటెక్స్ కంపెనీ ఛైర్మన్ సాబు జాకబ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం గురించి కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ వివరించారు. ముఖ్యంగా టెక్స్టైల్ రంగానికి స్థానికంగా ఉన్న వనరుల గురించి కూడా తెలిపారు.