కియాEV6 ధర రూ. 59.95 లక్షలు
కియా ఇండియా EV6 పేరుతో తొలి ఎలక్ట్రిక్ కారును ఇవాళ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.59.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). రెండు వేరియంట్లలో ఈ కారు అభిస్తుంది. GT RWD, AWD వెర్షన్స్‌లో లభిస్తుంది. టాప్ స్పెసిఫికేషన్స్ ఉన్న మోడల్ ధర రూ.64.96 లక్షలని కంపెనీ పేర్కొంది. 2025 నాటికి భారత్‌లోనే ఈవీలను తయారు చేయాలనే లక్ష్యంతో పినచేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (E GMP) పై ఈ కార్లను తయారు చేస్తున్నామని… ఇందులో భిన్నమైన కారు బాడీ షేప్, కేబిన్స్తో కార్లను తయారు చేయొచ్చని కంపెనీ పేర్కొంది. తొలుత వంద కార్లను దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ వంద కార్ల రిజర్వేషన్ పూర్తయిందన్నారు. కార్ల డెలివరీ సెప్టెంబర్ నెల నుంచి ఉంటుందని పేర్కొంది. కియా భారత్‌లో అందిస్తున్న కార్లలో ఇదే అత్యంత ఖరీదైన కారు. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 528 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అలాగే 350 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లోనే 80 శాతం చార్జ్ అవుతుంది.