For Money

Business News

గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తేశాం… ఇక ఇవ్వం

ఇంటి అవసరాలకు వాడే గ్యాస్‌ సిలెండర్‌లపై సబ్సిడీ ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020 జూన్‌ నుంచే గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలెండర్లపై సబ్సిడీ ఇవ్వడం మానేశామని… మున్ముందు కూడా సబ్సిడీ ఉండదని చమురు శాఖ కార్యదర్శి పంకజ్‌ జైన్‌ తెలిపారు. మార్చి 21వ తేదీన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గ్యాస్‌ కనెక్షన్లకు సంబంధించి ఓ ప్రకటన చేశారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇచ్చిన గ్యాస్‌ కనెక్షన్లకు రూ.200 సబ్సిడీ ఇస్తామన్నారు. ఆ సబ్సిడీ తప్ప మరే సబ్సిడీ కూడా గ్యాస్‌ సిలెండర్‌ వినియోగదారులకు ఉండదని పంకజ్‌ జైన్‌ స్పష్టంచేశారు. అది కూడా ఏడాదికి 12 సిలెండర్లకే ఇస్తారు. గ్రామీణ పేద మహిళలు నెలకు ఒక గ్యాస్‌ సిలెండర్‌ ఎటూ వాడరనే ఈ నిబంధన పెట్టినట్లుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉజ్వల స్కీమ్‌ కింద సగటున ఏడాదికి 3.68 సిలెండర్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వమే చెప్పింది.