For Money

Business News

అనంతపురం ప్లాంట్‌ నుంచి కియా కారెన్స్‌

అనంతపురం జిల్లాలోని తన ప్లాంట్‌ నుంచి కారెన్స్‌ తొలి యూనిట్‌ను కియా కంపెనీ ఉత్పత్తి చేసింది. ఈ మోడల్‌ కార్ల బుకింగ్స్‌ ఇప్పటికే కంపెనీ ప్రారంభించింది. ఫిబ్రవరిలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. మన మార్కెట్లోకి సంస్థ విడుదల చేయబోతున్న నాలుగో మోడల్‌ ఇది. కియా ఇప్పటికే సెల్టోస్‌, సోనెట్‌, కార్నివాల్‌ మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. కియా కారెన్స్‌ కంపెనీ దేశీయంగా ఉత్పత్తి చేస్తోన్న తాజా మోడల్‌. స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ) హంగులతోపాటు పెద్ద కుటుంబానికి పనికి వచ్చేలా మూడు వరుసల సీట్లతో డిజైన్‌ చేసిన రిక్రియేషన్‌ వెహికిల్‌ (ఆర్‌వీ) ఇది. కేవలం అనంతపురం ప్లాంట్‌లో ఉత్పత్తి కానున్న ఈ కారెన్స్‌ కార్లను దేశీయంగా విక్రయించడంతోపాటు 80 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.