సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ యాక్ట్‌కు కీలక సవరణ
స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలలో ప్రజల వాటాకు సంబంధించిన నిబంధనలను కేంద్రం మార్చింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం నిస్టయిన కంపెనీల్లో 25 శాతం వాటా ప్రజలకు ఉండాలి. ఒకవేళ లేకపోతే నిర్ణీత కాలంలోగా ప్రమోటర్లు తమ వాటాను విక్రయించి… కంపెనీలో కనీసం 25 శాతం వాటా ప్రజలకు ఉండేలా చూడాలి. అయితే ఇటీల లిస్టయిన ఎల్ఐసీలో కేవలం నామమాత్రం వాటానే ప్రభుత్వం విక్రయించింది. దీంతో అదనపు వాటా అమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఇపుడే ఆ షేర్ భారీ నష్టాలతో ట్రేడవుతోంది. ఈ నిబంధల ప్రకారం మరింత వాటా విక్రయానికి పెడితే షేర్ మరింత క్షీణిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) యాక్ట్‌కు సవరణ చేసింది. దీని ప్రకారం కేంద్రం లేదా రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ రంగ కంపెనీలను ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ మినహాయింపు నిర్ణీత సమయానికి మాత్రమే ఉంటుంది. కంపెనీ నియంత్రణ మారినా అంటే ప్రైవేట్ కంపెనీ చేతికి వెళ్ళినా ఈ మినహాయింపు ఉంటుందని కేంద్రం పేర్కొంది. డిజిన్వెస్ట్‌మెంట్ కింద పలు కంపెనీలను కేంద్రం అమ్మేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ రంగ సంస్థను టేకోవర్ చేసినా… వెంటనే వాటాను అమ్మాల్సిన పరిస్థితి ప్రైవేట్ కంపెనీలకు కూడా ఉండదన్నమాట.