For Money

Business News

ఇక నెల నెలా కరెంట్ షాక్‌

ఇక నుంచి ప్రతినెలా మీరు కరెంటు బిల్లు చూసుకోవాల్సి పరిస్థితి వస్తోంది. ఇపుడు ఎల్‌పీజీ గ్యాస్‌ ధర ప్రతినెలా సవరిస్తున్నారు. అలాగే ఇక నుంచి కరెంటు చార్జీలను కూడా ప్రతినెలా సమీక్షించాలని కేంద్రం నిర్ణయించింది. విద్యుత్‌ కొనుగోలు ధరలు, బొగ్గు, ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులను బట్టి ఎప్పటికప్పుడు ఆటోమేటిగ్గా కరెంటు చార్జీలను కూడా మార్చాలని కేంద్రం కొత్త రూల్స్‌ను ప్రతిపాదించింది. దీన్నే ట్రూప్‌ అప్‌ చార్జీలు అంటున్నారు. ఎపుడు ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్ళకు ఒకసారి వసూలు చేస్తున్నారు. ఇక నుంచి ట్రూఅప్‌ చార్జీలు ప్రతినెలా మారేలా కేంద్రం నిబంధనలు తెస్తోంది. ఇపుడు అమల్లో ఉన్న ‘విద్యుత్‌ నిబంధనలను సవరించింది. సవరిచంఇన ముసాయిదా పత్రాలను అన్ని రాష్ట్రాలకు పంపింది. కొత్తగా ప్రతిపాదించిన నిబంధనలపై సెప్టెంబర్‌ 11లోగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే పంపాలని పేర్కొంది. ఇక నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, గ్యాస్‌ ధరలు పెరిగినపుడల్లా కరెంటు చార్జీలూ పెరుగుతాయి. మరి తగ్గినపుడు తగ్గుతాయి. ప్రతి నెలా సవరించిన విద్యుత్‌ చార్జీలన్నింటినీ ఏడాదికోసారి రాష్ట్రాల విద్యుత్‌ రెగులేటరీ కమిషన్‌లు సమీక్షించాల్సి ఉంటుంది.