For Money

Business News

నష్టాల్లో సింగపూర్ నిఫ్టి

కొత్త సంవత్సరం సెవవుల తరవాత నిన్న అమెరికా మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. మూడు సూచీలు ఆకర్షణీయ లాభాలతో శుభారంభం చేసినా… మిడ్‌ సెషన్‌ తరవాత మార్కెట్లు బలహీనపడడ్డాయి. చివరికి నష్టాల్లో ముగిశాయి. రాత్రి కూడా యాపిల్‌, టెస్లా షేర్లు నాస్‌డాక్‌ను దెబ్బ తీశాయి. నాస్‌డాక్‌ 0.76 శాతం క్షీణించగా, ఎస్‌ అండ్‌ పీ 50 సూచీ 0.40 శాతం తగ్గింది. ఇక డౌజోన్స్‌ కూడా 0.03 శాతం అంటే స్థిరంగా ముగిసింది. రాత్రి డాలర్‌ ఇండెక్స్ స్వల్పంగా పెరిగి మళ్ళీ 104ను దాటింది. అయితే క్రూడ్‌ రాత్రి భారీగా క్షీణించడం విశేషం. బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఏకంగా 86 డాలర్ల నుంచి 82 డాలర్లకు క్షీణించింది. మాంద్యం భయాలే దీనికి ప్రధాన కారణం. ఇక బంగారం ధరలు పట్టపగ్గాల్లేకుండా పెరుగుతున్నాయి. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రంగా ఓపెన్‌ అయ్యాయి. జపాన్‌ నిక్కీ ఇవాళ ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. అయితే చైనా మార్కెట్‌తో పాటు హాంగ్‌సెంగ్‌ గ్రీన్‌లో ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ సూచీలు ఇవాళ ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. ప్రస్తుతానికి సింగపూర్ నిఫ్టి 61 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఓపెన్‌ అయ్యే సరికి ఈ నష్టాలు కాస్త తగ్గే అవకాశముందేమో చూడాలి. సో… నిఫ్టి స్వల్ప నష్టాలతో ప్రారంభం అయ్యే అవకాశముంది.