For Money

Business News

థియేటర్లలో ‘క్రయింగ్‌ రూమ్‌’

కేరళలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సినిమా థియేరట్లను నిర్మించి నడుపుతోంది. త్రివేండ్రంలో కొత్తగా నిర్మించిన కైరళి శ్రీ నీలా సినిమా థేయేటర్‌లో ప్రత్యేకంగా Crying Room రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది చిన్న పిల్లలతో సినిమాకు వచ్చే పెద్దల కోసం. సినిమా చూస్తున్నపుడు చిన్న పిల్లలు ఏడుస్తుంటారు… చీకటిగా ఉండటం, సౌండ్‌ కారణంగా పిల్లలు ఏడ్చే అవకావం ఉంటుంది. అలాగే ఒకోసారి డైపర్స్‌ మార్చాల్సి ఉంటుంది… ఇలాంటి వారి కోసం సౌండ్‌ ప్రూఫ్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పెద్దలు కూర్చోవడానికి ప్రత్యేక సీట్లతో పాటు పిల్లలను పడుకోబెట్టడానికి చిన్న ఊయలలు ఉంటాయి. అలాగే డయాపర్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ రూమ్‌లో పిల్లలను చూసుకుంటూ కూడా పెద్దలు సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చు. ఇతర థియేటర్లలో కూడా ఇలాంటి ప్రత్యేక రూమ్‌లను కేరళ స్టేట్‌ ఫిలిమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వీఎన్‌ వాసవన్‌ తెలిపారు.