For Money

Business News

ఆ కార్లను వెనక్కి రప్పించిన మారుతీ

సియాజ్‌, బ్రెజా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6, గ్రాండ్‌ విటారా మోడల్స్‌కు చెందిన 9125 కార్లను మారుతీ సుజుకీ కంపెనీ వెనక్కి రప్పించింది. ఈ వాహనాల్లో ముందు వరుస సీట్లలో అమర్చిన కొన్ని పార్ట్‌లలో డిఫెక్ట్‌ ఉన్నందున వాటిని వెనక్కి రప్పించినట్లు కంపెనీ తెలిపింది. ఈ వాహనాలను ఈ ఏడాది నవంబర్‌ 2 నుంచి 28వ తేదీ మధ్య ఉత్పత్తి చేసినట్లు మారుతీ తెలిపింది. వీటన్నింటిని ఉచితంగా రీప్లేస్‌ చేస్తున్నామని పేర్కొంది.