కావేరీ సీడ్స్ షేర్ల బైబ్యాక్
ప్రముఖ విత్తనాల ఉత్పత్తి సంస్థ కావేరీ సీడ్స్..రూ.125.6 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఈ ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఈ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రూ. 2 ముఖ విలువ గల కంపెనీ షేర్లను ప్రతి షేరుకు రూ.700కు మించకుండా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొత్తం పెయిడ్-అప్ క్యాపిటల్‌లో 9.85 శాతానికి సమానమైన అంటే 17.95 లక్షల షేర్లను బైబ్యాక్ చేయబోతున్నది. గత ఏడాది కూడా కంపెనీ రూ. 850 చొప్పున షేర్లను బై బ్యాక్ చేసింది. దీని కోసం రూ.120 కోట్లు వెచ్చించింది. నిన్న మార్కెట్ ముగిసిన సమయానికి కంపెనీ షేరు 5.85 శాతం అంటే రూ. 26.75 పెరిగి రూ.483.75 వద్ద ముగిసింది.