For Money

Business News

ECB: వడ్డీ రేటు 0.75 శాతం పెంపు

యూరోపియన్‌ కేంద్ర బ్యాంక్‌ (ఈసీబీ) కీలక వడ్డీ రేట్లను మరో 0.75 శాతం పెంచింది. యూరో కరెన్సీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈసీబీ వడ్డీ రేట్లు ఇంత భారీగా పెంచడం ఇదే మొదటిసారి. దీంతో యూరో జోన్‌లో కనసీ వడ్డీ రేట్లు 1.25 శాతం నుంచి 2 శాతానికి చేరాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో వడ్డీ రేట్లను పెంచడం వినా మరో మార్గం లేదని ఈసీబీ భావిస్తోంది. అధిక వడ్డీ రేట్లతో ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నా ఈసీబీ ఈ చర్య తీసుకోవడం విశేషం. ఇపుడు ద్రవ్యోల్బణం 9.9 శాతం కాగా, 2.4 శాతానికి దిగొచ్చే వరకు యూరో జోన్‌లో వడ్డీ రేట్ల పెంపు తప్పదని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.