For Money

Business News

డౌ అప్… నాస్‌డాక్‌ డౌన్‌

కొన్ని కార్పొరేట్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో డౌజోన్స్‌ ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. మెటా ప్లాట్‌ఫామ్స్‌ దెబ్బకు నాస్‌డాక్‌ ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 0.22 శాతం నష్టంతో ఉంది. జాబ్‌లెస్‌ క్లయిమ్స్‌ మార్కెట్‌ అంచనాలకంటే తక్కువగా ఉండటం, జీడీపీ వృద్ధి డేటా కూడా ఆశాజనకంగా ఉండటంతో బాండ్‌ ఈల్డ్స్‌ భారీగా తగ్గాయి. డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 110ని దాటింది. అమెరికా జీడీపీ డేటా అంచనాలను మించడంతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు మరింత పెరిగాయి. ఇపుడు బ్రెంట్‌ క్రూడ్‌ 97 డాలర్లు దాటింది. డాలర్‌ పెరగడంతో మెటల్స్‌ మొత్తం పడ్డాయి. బులియన్‌ కూడా స్వల్పంగా తగ్గింది.