For Money

Business News

22 శాతం క్షీణించిన మెటా

ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ కంపెనీ ఇవాళ 22 శాతంపైగా క్షీణించింది. ఇంకా నష్టాల్లోనే కొనసాగుతోంది. కంపెనీ ఫలితాలు దారుణంగా ఉండటంతో ఇవాళ ఈ ఒక్కరోజే కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 7000 కోట్ల డాలర్ల మేరకు తగ్గనుంది. ఇదే జరిగితే టాప్‌ టెన్‌ టెక్‌ కంపెనీల జాబితా నుంచి మెటా వైదొలగనుంది. మెటావెర్స్‌పై భారీ పెట్టుబడి, యాడ్స్‌ తగ్గడం వంటి అంశాల కారణంగా మెటా ఫలితాలు నిరాశపర్చాయి. ప్రస్తుతం మెటా షేర్‌ 100 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది ఏడేళ్ళ కనిష్ఠ స్థాయి. పరిస్థితి ప్రతికూలంగా ఉన్న సమయంలో వివిధ రకాల కొత్త ప్రాజెక్టులకు భారీ మొత్తాన్ని మెటా ఖర్చు పెడుతోందని అనలిస్టులు విమర్శిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, స్నాప్‌ తరవాత మెటా ఫలితాలు టెక్‌ మార్కెట్‌ను దారుణంగా దెబ్బతీస్తున్నాయి.