For Money

Business News

రెండో స్థానంలో కర్ణాటక

ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో మహారాష్ట్ర మళ్ళీ నంబర్‌ వన్‌గా నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో 38.9 శాతంతో ఏ రాష్ట్రానికీ అందనంత ఎత్తులో నిలిచింది. 11.9 శాతంతో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఉన్న ఢిల్లీ వాటా 10.4 శాతమని ఎస్‌బీఐ రీసెర్చి నివేదిక పేర్కొంది. నాలుగో స్థానంలో ఉన్న తమిళనాడు 6.5 శాతం కాగా, 4.8 శాతం గుజరాత్‌ అయిదో స్థానంలో ఉంది. మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో టాప్‌ 5లో ఉన్న రాష్ట్రాల నుంచి 70 శాతంపైగా పన్నులు వసూలు అయినట్లు నివేదిక వెల్లడించింది. గడచిన ఏడు సంవత్సరాల్లో తొలిసారి కర్ణాటక వాటా ఢిల్లీని మించిందని ఎస్‌బీఐ రీసెర్చి పేర్కొంది. పన్ను వసూళ్ళ విధానంలో అనేక మార్పులు తెచ్చినందున గడచిన 14 ఏళ్ళలో ఎన్నడూ లేనిస్థాయిలో 2023-2024 రికార్డు వసూళ్ళు వచ్చినట్లు వివరించింది.