For Money

Business News

6న పబ్లిక్‌ ఆఫర్‌ ప్రారంభం

ఫుడ్‌ డెలివరీ రంగం నుంచి మరో కంపెనీ నిధుల సమీకరణకు ప్రైమరీ మార్కెట్‌కు రానుంది. ఇప్పటికే సెబీ నుంచి అనుమతి పొందిన స్విగ్గీ కంపెనీ తన తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు సంబంధించిన వివరాలను ఇవాళ వెల్లడించింది. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ.10వేల కోట్లు సమీకరించే లక్ష్యంతో ఈ కంపెనీ మార్కెట్‌లోకి వస్తోంది. ఈ ఇష్యూలో భాగంగా రూ.3,750 కోట్ల విలువైన కొత్త షేర్లను కంపెనీ జారీ చేస్తోంది. మిగిలిన మొత్తం ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ వాటాలోని కొంత భాగాన్ని ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో అమ్ముతారు. ఈ లెక్కన ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద కంపెనీ 182,286,265 షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఈ ఐపీఓ నవంబర్‌ 6న ప్రారంభమై 8న ముగుస్తుంది. ఒక రోజు ముందుగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.750 కోట్లను సమీకరిస్తారు. అయితే ఈ ధరకు షేర్లను ఆఫర్‌ చేసేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు. స్విగ్గీని 2014లో నెలకొల్పారు. ఈ కంపెనీ వ్యాల్యూయేషన్‌ సుమారు 1500 కోట్ల డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఫుడ్‌ డెలివరీ రంగం నుంచి 2021లో జొమాటొ తొలిసారి పబ్లిక్‌ ఆఫర్‌ చేసింది. రూపాయి ముఖ విలువతో ఒక్కో షేర్‌ను రూ. 76లకు ఆఫర్‌ చేసింది జొమాటొ. 52శాతం ప్రీమియంతో ఈ షేర్‌ లిస్టయినా.. తరవాత 2023లో షేర్‌ ధర రూ.46.95కు పడిపోయింది. అక్కడి నుంచి కోలుకుని ఇపుడు రూ. 251.95 వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply