For Money

Business News

సీబీఐ అదుపులో ఈశ్వర్‌ రెడ్డి

జాయింట్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఎస్. ఈశ్వర్రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రముఖ ఫార్మా కంపెనీ బయోకాన్‌ అనుబంధ సంస్థ అయిన బయోకాన్‌ బయోలాజిక్స్‌ కంపెనీ అభవృద్ధి చేసిన ఇన్‌సులిన్‌ ఆప్‌పార్ట్‌ ఇంజక్స్‌.2కు సంబంధించి మూడో దశ ట్రయల్స్‌ను మినహాయించేందుకు ఈశ్వర్‌ రెడ్డి లంచం అండిగారు. ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్‌ కంపెనీ డైరెక్టర్‌ నుంచి రూ. 4 లక్షల లంచం తీసుకుంటుండగా ఈశ్వర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఢిల్లీలోని ద సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (CDSCO) ప్రధాన కార్యాలయంలో ఈశ్వర్‌ రెడ్డితో పాటు మరో వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. అతనితో పాటు బయోకాన్‌ బయోలాజిక్స్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ను కూడా సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ వ్యవహారంలో అయిదుగురు వ్యక్తులతోపాటు, మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది.
ఈకేసుకు సంబంధించి నోయిడా , గురుగ్రామ్, పాట్నా, బెంగుళూరుల్లోని 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ కేసులో ఢిల్లీకి చెందిన బయోఇన్నోవాట్ రీసెర్చ్ సర్వీసెస్ కంపెనీ డైరెక్టర్ గుల్జిత్ సేథి, సినర్జీ నెట్‌వర్క్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడకు చెందిన దినేష్ దువా, బెంగు ళూరుకు చెందిన బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్‌ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్.ప్రవీణ్ కుమార్, ఢిల్లీ సీడీఎసీసీఓలోని అసిస్టెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అనిమేష్‌ కుమార్‌తోపాటు మరికొంద కొందరు గుర్తుతెలియని వ్యక్తులను ఈ కేసులో నిందితులుగా సీబీఐ చేర్చింది.అయితే ఈ ఆరోపణలను బయోకాన్‌ ఖండించింది.