సౌదీకి జో బైడెన్?
యూరిపియన్ దేశాలు కలిసి రాకున్నా… రష్యా నుంచి ఆయిల్ దిగుమతులపై ఆంక్షలు విధించాలని అమెరికా భావిస్తోంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు సౌదీ అరేబియా నుంచి ఆయిల్ ఉత్పత్తి పెరిగేలా చూడాలని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జొ బైడెన్ సౌదీ అరేబియాను సందర్శించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. రష్యాపై ఆంక్షలు విధించే ముందు తనతో పాటు ఇతర దేశాలకు ఇబ్బంది రాకుండా చూడాలని అమెరికా భావిస్తోంది. చమురు ధరలు భారీగా పెరగడంతో ఇపుడు అమెరికాలో షేల్ గ్యాస్ ద్వారా ఉత్పత్తి పెంచతున్నారు. అయితే ఒపెక్ దేశాల నుంచి ఉత్పత్తి పెంచడమే మార్గమని అమెరికా భావిస్తోంది. పైగా ఒపెక్ దేశాల్లో ఒక్క సౌదీ అరేబియా, యూఏఈలు మాత్రమే ఉత్పత్తి పెంచగలవు. దీంతో సౌదీ చర్చలకు బైడెన్ ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.