For Money

Business News

బార్క్‌ రేటింగ్‌ మాకు అక్కర్లేదు

టీవీ ఛానల్స్‌కు రేటింగ్‌ ప్రకటించే బార్క్‌ (Broadcasters Audience Research Council -BARC) మళ్ళీ ఇబ్బందుల్లో పడింది. పలు ఛానల్స్‌ బార్క్‌ రేటింగ్‌ విధానంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక నుంచి నాలుగు వారాల రోలింగ్‌ యావరేజీని బట్టి రేటింగ్‌ ఇస్తామని బార్క్‌ ప్రకటించింది. ఈనెల 17వ తేదీ నుంచి రేటింగ్స్ రావాల్సి ఉంది. అయితే రేటింగ్‌ కొలవడానికి చాలా తక్కువ మీటర్లు పెడుతున్నారని, అసలు ఎన్ని మీటర్లు పెడుతున్నారో చెప్పడం లేదని ఎన్‌డీటీవీ పేర్కొంది. బార్క్‌ అవలంబిస్తున్న తాజా పద్ధతి కూడా లోపభూయిష్టంగా ఉందని ఎన్‌డీటీవీ అంటోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా చాలా మంది అభిప్రాయాలతో చేస్తున్నారని… కాని టీవీ ఛానల్స్‌ రేటింగ్‌ చాలా తక్కువ మందితో చేస్తున్నారని ఎన్‌డీటీవీ ఆరోపిస్తోంది. అందుకే తాము బార్క్‌ రేటింగ్‌ను సబ్‌ స్క్రయిబ్‌ చేయడం లేదని పేర్కొంది. దాని నుంచి బయటకు వస్తున్నామని స్పష్టం చేసింది. తమ రేటింగ్‌ను ప్రేక్షక దేవుళ్ళే నిర్ణయిస్తారని స్పష్టం చేసింది.