బోర్డు నుంచి వైదొలగిన జాక్ డోర్సీ
ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సీ ఆ సంస్థ గవర్నింగ్ బోర్డు నుంచి వైదొలగారు. ఆయన ప్రస్తుతం ఫైనాన్షియల్ పేమెంట్స్ ప్లాట్‌ఫాం బ్లాక్ (Block)కు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన గత నవంబర్‌లో సీఈఓగా రాజీనామా చేశారు. మున్ముందు ఎపుడూ కంపెనీ సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టనని కూడా ఆయన అన్నారు. ఆయన స్థానంలోనే మనదేశానికి చెందిన పరాగ్ అగర్వాల్ సీఈఓ అయ్యారు. ట్విటర్‌లో ఎన్ని తప్పుడు అకౌంట్లు ఉన్నాయంటూ టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ పదే పదే ఛాలెంజ్ చేస్తున్న నేపథ్యంలో జాక్ రాజీనామా చేయడం ఆశ్చర్యం కల్గిస్తోంది. జాక్ ఇపుడు వైదొలగినా.. వాటాదారుల సమావేశం జరిగే వరకు ఆయన బోర్డులో సభ్యునిగా ఉంటారని ట్విటర్ పేర్కొంది.